యూరియా కోసం మహిళా రైతు పడిగాపులు

SDPT: అక్కన్నపేట(M) కేంద్రంలోని సింగిల్ విండో ఎరువుల దుకాణం ముందు యూరియా కోసం ఓ మహిళా రైతు పడిగాపులు కాశారు. షాప్ తెరుచుకునే ముందు రాత్రే వచ్చి లైన్‌లో ఆధార్, పాస్‌బుక్ ఉంచి అక్కడే నిద్రించారు. రైతులకు సమయానికి ఎరువులు అందకపోవడంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఇబ్బందులు తొలగేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.