మాజీ సీఎం కేసీఆర్ సతీమణికి రాజన్న చిత్రపటం అందజేత

SRCL: మాజీ ముఖ్యమంత్రి KCR సతీమణి శోభమ్మ, వారి మనువడు హిమాన్షులతో కలిసి వేములవాడకు రాగా, BRS వేములవాడ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చెలిమెడ లక్ష్మీనరసింహారావు రాజరాజేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు. వారి వెంట మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.