ఒకేసారి మూడు నెలల బియ్యం సరఫరా

KMM: జిల్లాలోని రేషన్ లబ్ధిదారులకు జూన్, జూలై, ఆగస్టు నెలల బియ్యాన్ని ఒకేసారి అందించనున్నట్లు DCSO చందన్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 4,15,905 కార్డులకు గాను 12,03,943 లబ్ధిదారులు ఉన్నారన్నారు. వీరికి 21,915.32 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తామని వెల్లడించారు. జూన్ 1వ తేదీ నుంచి 30 వరకు పంపిణీ ఉంటుందన్నారు.