VIDEO: జన సమీకరణ కోసం బస్సులు.. ప్రయాణికులకు అవస్థలు

VIDEO: జన సమీకరణ కోసం బస్సులు.. ప్రయాణికులకు అవస్థలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నస్తూర్ పల్లి సభకు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నారు. ఐదుజిల్లాల నుంచి జన సమీకరణకు బస్సులు కేటాయించడంతో సాధారణ రూట్లలో సేవలు నిలిచిపోయాయి. ప్రయాణికులు బస్‌స్టాప్‌లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. నడుస్తున్న కొద్ది బస్సుల్లోనూ అధిక రద్దీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.