VIDEO: ఆసిఫాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
ASF: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిపై ఆసిఫాబాద్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని ఆదిలాబాద్ ఎక్స్ రోడ్డు వద్ద శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో పాటు వాహనాల ధ్రువపత్రాలను పరిశీలించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న పలువురిని అడ్డుకుని కేసులు నమోదు చేసినట్లు CI బాలాజీ వరప్రసాద్ పేర్కొన్నారు.