రహదారిపై భారీ వృక్షం.. ట్రాఫిక్‌కు అంతరాయం
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం రస్తాకుంటుబాయి వద్ద భారీ వృక్షం రహదారిపై కూలిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని వృక్షాన్ని తొలగించే పనులు ప్రారంభించారు.