'నీట్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి'

BHPL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రాలను శనివారం ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో నీట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నీట్ పరీక్ష నిర్వహణకు జిల్లాలో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.