రౌడీలను హెచ్చరించిన ధవళేశ్వం సీఐ

రౌడీలను హెచ్చరించిన ధవళేశ్వం సీఐ

E.G: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం ధవళేశ్వం సీఐ టీ. గణేశ్ హెచ్చరించారు. అక్రమంగా రౌడీ మూకలు, బ్లేడ్, గంజాయి వంటి కార్యకలాపాల్లో పాల్పడేవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని తెలిపారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా ఎవరైన కనిపిస్తే ప్రజలు పోలీస్‌లకి తెలియజేసి శాంతి భద్రతలకు భాగస్వామ్యులు కావాలని సీఐ వెల్లడించారు.