కలెక్టర్ ఆదేశాల మేరకు చెరువుల వివరాలు సేకరణ

SKLM: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చెరువులను పరిశీలిస్తున్నామని ఏఎస్ఓ వై జోగారావు, గ్రామ రెవెన్యూ అధికారి పైడియ్య తెలిపారు. ఆదివారం నరసన్నపేట మండలం కరగాం పంచాయతీలో ఉన్న ఆరు చెరువుల వివరాలను సేకరించామని వివరించారు. వారు మాట్లాడుతూ. చెరువుల సర్వే నెంబరు, విస్తీర్ణం, ఆయకట్టు తదితర వివరాలను నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు.