ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు
NZB: పచ్చల నడుకూడ గ్రామంలో భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురుల వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన విప్లవ వీరుల చిత్రపటాలకు గ్రామస్తులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రఘు, గుడాల మోహన్, టక్కరి గంగాధర్, నర్సారెడ్డి, జెండా కార్డు లింగేశ్వర్, మండల భోజన్న, నెహ్రూ, పలువురు పాల్గొన్నారు.