పాలేరు జలాశయంలో తగ్గిన వరద

KMM: పాలేరు జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. రెండు రోజుల క్రితం ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టమైన 23 అడుగులకు మించి 24.5 అడుగులకు చేరింది. అయితే వరద తగ్గుముఖం పట్టడంతో ఆదివారం ఉదయం 7 గంటలకు అలుగు స్వల్పంగా పారుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 5,000 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 6,000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది.