ఎల్కతుర్తిలో ఉచిత బస్సు ప్రయాణం

ఎల్కతుర్తిలో ఉచిత బస్సు ప్రయాణం

HNK: ఎల్కతుర్తి బస్టాండ్‌లో ఇవాళ ఆర్టీసీ బస్సులో ప్రయాణికులందరికీ ఉచిత ప్రయాణం కల్పించారు. బస్సు ఎక్కిన ప్రయాణికులకు డ్రైవర్ టికెట్ లేకుండా ప్రయాణించవచ్చని ప్రకటించడంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. కండక్టర్ లేకపోవడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఈనిర్ణయం తీసుకున్నట్లు డ్రైవర్ తెలిపారు. దీంతో ప్రయాణికులు సంతోషంగా తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.