VIDEO: కొండగట్టులో ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్
JGL: చిన్న జయంతి సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో రద్దీ కొనసాగుతోంది. గురువారం రాత్రి కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కొండగట్టు చేరుకొని, ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో అంజనరెడ్డి, అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, తదితరులు ఉన్నారు.