జిల్లా కలెక్టరెట్‌లో సోమవారం గ్రీవెన్స్ రద్దు

మన్యం: జిల్లాలో అధికవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లో జరగబోయో ప్రజాసమస్యల పరిష్కారవేదిక (గ్రీవెన్స్) రద్దు చేస్తున్నట్లు కలెక్టరెట్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. జిల్లా ప్రజలు అందరూ గమనించాలని తెలిపారు. అధిక వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, చెట్ల కింద, పొలాల్లో ఉండకూడదని సూచించారు.