'నరసాపురంలోని రెస్టారెంట్లలో తనిఖీలు'

W.G: నరసాపురం టౌన్‌లో పలు రెస్టారెంట్లలో మంగళవారం తహసీల్దార్ రాజరాజేశ్వరి, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. రెస్టారెంట్లలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నట్లు గుర్తించామని తహసీల్దార్ తెలిపారు. మెయిన్ రోడ్డులోని మాధురి రెస్టారెంట్‌పై కేసులు నమోదు చేశామన్నారు. అలాగే హోటల్లో నాలుగు గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.