కార్పొరేషన్ అభివృద్ధిలో కార్పొరేటర్లు, అధికారులు రాజీ పడొద్దు
MNCL: కార్పొరేషన్ అభివృద్ధిలో కార్పొరేటర్లు, అధికారులు రాజీ పడవద్దని MLA ప్రేమ్ సాగర్ రావు సూచించారు. మంచిర్యాల మున్సిపల్ కార్యాలయం ఆవరణలో డివిజన్ల ఆఫీసర్లతో సమావేశం జరిగింది. ప్రతి ఇంటిని తమ ఇంటిగా భావించి సమస్యల పరిష్కారానికి ఆయా డివిజన్ల అధికారులు బాధ్యత వహించాలని అన్నారు. మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేశ్, అధికారులు పాల్గొన్నారు.