'అంధత్వం కాదు, అవగాహనే బంధం'
ATP: అనంతపురంలోని బెంగళూరు రోడ్‌లోని శివ బాలయోగి ఆశ్రమంలో ఆశ్రమ కార్యనిర్వహకుడు విజయ సాయి కుమార్ ఆధ్వర్యంలో శనివారం ఇద్దరు అంధులకు వివాహం జరిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేర్వేరు కులాలు, అంధత్వం ఉన్నా పరస్పర అవగాహనతో ఒక్కటైన నూతన వధూవరులను అభినందించి, ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ స్వరూప తదితరులు పాల్గొన్నారు.