చెరుకుపల్లిలో ప్రమాదం.. అక్కా తమ్ముడికి తీవ్ర గాయాలు

చెరుకుపల్లిలో ప్రమాదం.. అక్కా తమ్ముడికి తీవ్ర గాయాలు

బాపట్ల: చెరుకుపల్లిలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కాతమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. అతి వేగంగా వెళుతున్న లారీ చెరుకుపల్లి అంబేడ్కర్ సెంటర్ వద్ద బైక్‌పై వెళ్తున్న అక్క ఆశా సంతోషిణి, తమ్ముడు గౌతమ్ జయ కృష్ణను ఢీ కొట్టి వారి కాళ్లపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో వారిరువురు తీవ్రంగా గాయపడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.