పసుపు కొమ్ముల అలంకరణలో నూకాంబిక అమ్మవారు

పసుపు కొమ్ముల అలంకరణలో నూకాంబిక అమ్మవారు

AKP: ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి నూకాంబిక అమ్మవారు ఆదివారం పసుపు కొమ్ముల అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ సహాయ కమిషనర్ కే.సుధారాణి మాట్లాడుతూ.. శ్రావణమాసం నేపథ్యంలో పసపు కొమ్ములతో అలంకరణ చేపట్టామన్నారు. అమ్మవారి దర్శనానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు.