గడ్డి మందు తాగి యువకుడు మృతి

VSP: వెళ్ళంకి గ్రామంలో గురువారం గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ శుక్రవారం యువకుడు మృతి చెందాడు. అప్పలరాజు వయసు 27 దుబాయ్‌కి వెళ్లేందుకు డబ్బులు ఇవ్వలేదని మనస్థాపంతో గడ్డి మందు తాగి మృతి చెందాడు. శవ పరీక్ష పూర్తి చేసి మృతదేహం బంధువులకు అప్పగించినట్లు ఆనందపురం పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ఏఎస్ఐ సత్తిబాబు దర్యాప్తు చేస్తున్నారు.