పుష్పగిరిలో అరుదైన కాలభైరవుని కుడ్య శిల్పం

పుష్పగిరిలో అరుదైన కాలభైరవుని కుడ్య శిల్పం

KDP: వల్లూరు మండలం పుష్పగిరి శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ సమీపంలోని రుద్రపాద ఆలయ ముఖ ద్వారంపై ఉన్న ద్వారపాలకుల కుడ్య శిల్పాలలో కాలభైరవుని అత్యంత అరుదైన కుడ్య శిల్పమని చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేశ్ ఇవాళ తెలిపారు. శివుని భయానక రూపాలలో ఒకటైన కాలభైరవునికి మూడు కన్నులు ఉండటం ఆయన దివ్యత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.