రోడ్డు ప్రమాదం.. హోంగార్డుకు గాయాలు

రోడ్డు ప్రమాదం.. హోంగార్డుకు గాయాలు

SRPT: మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై పోలీస్ హోంగార్డు ఖాజాకు సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపైకి అకస్మాత్తుగా వచ్చిన కుక్కను తప్పించబోయి ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోవడంతో ఆయనకు ఎడమ కాలు, తలకు గాయాలయ్యాయి. మునగాల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించి తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.