'రెల్లి ఉపకలాలకు న్యాయం చేయాలి'

VZM: జిల్లాలోని రెల్లి ఉపకలాలకు(ఎస్.సి )లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని రెల్లి ఉపకులాల జిల్లా అధ్యక్షుడు సోము మురళీమోహన్ డిమాండ్ చేశారు. బుధవారం రెల్లి ఉప కులాలకు న్యాయం చేయాలని కోరుతూ జాతీయ రహదారి పక్కన నిరసన దీక్షతో పాటు ర్యాలీ జరిపారు. గజపతినగరం నియోజకవర్గ అధ్యక్షుడు రామారావు ఆధ్వర్యంలో జరిగింది. నేతలు సోమాద్రి వెంకయ్య పాల్గొన్నారు.