యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
TG: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక మాసం, ఆదివారం కావడంతో లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనానికి భక్తజనం పోటెత్తింది. ధర్మ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. సెలవురోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తున్నారు.