రైతు భరోసా నిధులను విడుదల చేయాలి: మాజీ ఎమ్మెల్యే

WGL: రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు డోర్నకల్ మండల కేంద్రంలో మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డోర్నకల్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.