హైదరాబాద్ కు తరలిన ఎమ్మార్పీఎస్ నాయకులు
ASF: పద్మశ్రీ అవార్డు గ్రహీత మన్యశ్రీ మందకృష్ణ తలపెట్టిన కార్యక్రమం దళిత ఆత్మగౌరవ నిరసన ర్యాలీకి రెబ్బెన మండలం నుంచి శనివారం ఎమ్మార్పీఎస్ నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరా పార్కు నుంచి ర్యాలీ ప్రారంభం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు గోగర్ల రాజేష్, చిలుముల నర్సింహులు, కృష్ణ తదితరులు ఉన్నారు.