ఓయూ తెలుగు శాఖ ఛైర్మన్‌గా జిల్లా వాసి
NLG: ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌గా జిల్లాకు చెందిన డా. రామోజు రఘు నియమితులయ్యారు. పాఠశాల స్థాయి నుంచి వర్సిటీ వరకు పాఠ్యాంశాల రూపకల్పనలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. రఘు నియామకం పట్ల సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. డా. ఇడికోజు శ్రీనివాసాచారి, పరిశోధక విద్యార్థి పల్లె సతీశ్ శుభాకాంక్షలు తెలిపారు.