కాంగ్రెస్ తీరుపై జగదీష్ రెడ్డి ధ్వజం
సూర్యాపేట: అడ్డూఅదుపు లేని పాలనతో కాంగ్రెస్ రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులు, మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.