VIDEO: ఘోర అగ్నిప్రమాదం.. 800 చెట్లు దగ్ధం
JGL: భీమారం మండల కేంద్రంలో ఈతవనంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించి సుమారు 800 ఈత చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ వనంపై ఆధారపడి జీవించే దాదాపు 100 గీత కార్మిక కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. ఏడాది శ్రమ కళ్లముందే బూడిద కావడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.