పదోన్నతులు బాధ్యతలను పెంచుతాయి: ఎస్పీ
NRPT: జిల్లాలో ఉద్యోగులకు పదోన్నతులు రావడం వల్ల బాధ్యతలు మరింత పెరుగుతాయని ఎస్పీ డాక్టర్ వినీత్ పేర్కొన్నారు. DCRBలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శ్రీదేవి హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందగా, ఎస్పీ ఆమెకు బ్యాడ్జ్ అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.