ఇంట్లో చోరీ.. కేసు నమోదు

ఇంట్లో చోరీ.. కేసు నమోదు

సూర్యాపేట: మేళ్లచెరువు మండలం వెల్లటూరు కాలనీ సమీపంలోని ఓ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఐదుగురు దుండగులు ఇటుక బట్టీల నిర్వాహకుడు ఉప్పతల వెంకయ్య ఇంట్లోకి చొరబడి 5.5 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.50 వేల నగదును అపహరించుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.