రైతులకు అందుబాటులో పచ్చిరొట్ట విత్తనాలు

రైతులకు అందుబాటులో పచ్చిరొట్ట విత్తనాలు

ASR: కొయ్యూరు మండలంలో రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. మండలంలో 2,400 కిలోల పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారిణి ఉమాదేవి మంగళవారం తెలిపారు. వీటిలో జనుము 1,400 కిలోలు ఉన్నాయన్నారు. ఇతర రకాల విత్తనాలు టన్ను ఉన్నాయన్నారు. పచ్చిరొట్ట విత్తనాలు అవసరమైన రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలన్నారు.