వంశధార నది తీరంలో ఘనంగా గంగాహారతి

వంశధార నది తీరంలో ఘనంగా గంగాహారతి

SKLM: సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలోని వంశధార నది తీరాన వెలసిన శ్రీ ఉమా కామేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం మూడో సోమవారం రాత్రి గంగా హారతి కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు జి. వాసు దేవ శర్మ ఈ హారతిని శాస్త్రోక్తంగా నిర్వహించారు .భక్తులు “హరహర మహాదేవ” నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగించారు.