VIDEO: రైతుల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే
కృష్ణా: పంట పక్వానికి రాకుండా రైతన్నలు కోతలు కోయవద్దని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచించారు. గుడ్లవల్లేరు మండలం శేరికల్వపూడి గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించారు. గ్రామ రైతు సురక్ష కేంద్రంలో రైతులతో ఎమ్మెల్యే సమావేశమై, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శేరికల్వపూడి గ్రామ రైతుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే తక్షణ చర్యలు తీసుకున్నారు.