ఆలయంలో పంటల భవిష్యవాణి

KRNL: దేవనకొండ మండలం నల్లచెలిమల గ్రామ సమీపంలో గల శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పంటల భవిష్య వాణి వెల్లడైంది. ఆదివారం రాత్రి ఆలయ పురోహితులు మాట్లాడుతూ.. మూడు దండలు నలగకుండా రావడాన్ని బట్టి ఈ ఏడాది పంటలు బాగా పండుతాయని తెలిపారు. ఈ ప్రక్రియ మా తాత, ముత్తాతల కాలం నుంచి ఆచరిస్తున్నామని.. వారు వెల్లడించారు. భవిష్య వాణి తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.