తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు: ఎమ్మెల్యే
ASR: అరకు డిగ్రీ కాలేజీలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పాల్గొని మాట్లాడుతూ.. "అంబేద్కర్ అందించిన ఓటు ఆయుధంతో యువత వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు దాగి ఉంది" అని పిలుపునిచ్చారు. 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.