'రైతును రాజును చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం'
PLD: ముప్పాళ్ల మండలంలోని ఇరుకుపాలెం గ్రామం నందు అన్నదాత సుఖీభవ, ఇంటింటికి ప్రచారం అనే కార్యక్రమంలో శాసనసభ్యులు కన్నా లక్ష్మినారాయణ పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి అన్నదాత సుఖీభవ 3వ విడత నిధుల విషయమై రైతన్నలను అడిగి తెలుసుకున్నారు. రానున్న 5 సంవత్సరాలలో రైతును రాజు చేసేందుకు నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ అమలు చేయనున్నారు.