ఇకపై రాష్ట్రంలో భిక్షాటన నిషేధం
AP: రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 'భిక్షాటన నివారణ (సవరణ) చట్టం-2025' అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమలుతో ఇకపై రాష్ట్రంలో ఎక్కడ భిక్షాటన చేసినా.. తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు. ఈనెల 15న చట్టానికి గవర్నర్ ఆమోదముద్ర వేయగా.. 27న ఏపీ గెజిట్‌లో చట్టం ప్రచురితమైంది. జీవో ఎంఎస్ నం.58 విడుదల చేశారు.