పుష్కర భద్రత ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ

BHPL: భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుష్కర భద్రత ఏర్పాట్లను ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్పీ కిరణ్ ఖరే గురువారం పరిశీలించారు. ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు, ఘాట్లు, సీసీ కెమెరా ఏర్పాటు తదితర భద్రతా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. పుష్కరాలకు భారీగా భక్తులు రానున్నందున పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులున్నారు.