నిజాంసాగర్ రెండో విడత నీటి విడుదల

KMRD: నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగవుతున్న పంటల కోసం నిజాంసాగర్ నీటిని శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ఆయకట్టు కింద సాగవుతున్న 1,30,000 ఎకరాలకు డిసెంబర్లో మొదటి విడతలో 2.44 టీఎంసీల నీటిని విడుదల చేయగా, శుక్రవారం 2వ విడత నీటిని వదిలారు. ప్రధాన కాలువ ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ క్రమంగా నీటి విడుదలను పెంచుతామని ఇరిగేషన్ ఈఈ సోలోమన్ తెలపారు.