VIDEO: గాలివాన బీభత్సం.. నేలరాలిన మామిడి కాయలు

WGL: జిల్లా వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. గాలి తీవ్రస్థాయిలో రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం వర్ధన్నపేట మండలంలోని దమ్మన్నపేట గ్రామ శివారులో ఉన్న మామిడి తోటల సైతం గాలివానకు మామిడికాయలు నేలరాలాయి. ఈ సందర్భంగా పెద్దబోయిన రమేష్ అనే రైతు మామిడి తోటలో మామిడికాయలు రాలిపోవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.