ప్రమాదంపై మంత్రి మండిపల్లి విచారం

ప్రమాదంపై మంత్రి మండిపల్లి విచారం

TPT: పాకాల మండలం తోటపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరా తీశారు. ఐదుగురు మృతిచెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని రుయా ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.