VIDEO: బాన్సువాడలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా
KMR: బాన్సువాడ పట్టణంలో గ్యాస్ సిలెండర్ల బ్లాక్ దందా జోరుగా నడుస్తోంది. నిర్వాహకులు సిలెండర్ సీల్ తీసి మరో ఖాళీ సిలెండర్లో సగం నింపి రూ.2,500 అమ్ముతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంగమేశ్వర కాలనీలో స్థానికులు ఆటోను వెంబడించి ఆపడంతో డ్రైవర్ పరారయ్యాడు. కృత్రిమ కొరత సృష్టిస్తున్న గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.