పీజీ డిప్లమో కోర్సు దరఖాస్తు గడువు పెంపు

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న పీజీ డిప్లమో ఇన్ కౌన్సెలింగ్ అండ్ గైడెన్స్‌పై ఆన్‌లైన్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు గడువును నవంబర్ 6వ తేదీ వరకు పొడిగించినట్లు డైరెక్టర్ ఆచార్య డీఏ. నాయుడు తెలిపారు. నవంబర్ 7వ తేదీన ఉదయం 10 గంటల నుంచి కౌన్సెలింగ్ నిర్వహించి సీట్ల కేటాయించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా 7వ తేదీన హాజరు కావాలని సూచించారు.