రెండు రోజులుగా నీటి సరఫరా నిలిపివేత

రెండు రోజులుగా నీటి సరఫరా నిలిపివేత

హన్మకొండ జిల్లా 46 డివిజన్ పరిధిలోని మడికొండ గ్రామంలో గురువారం ఆగస్టు 21 నుంచి రెండు రోజులుగా GWMC నల్లా నీటి సరఫరా నిలిచిపోయింది. వాటర్ పైప్ లైన్ లీక్ కారణంగా ఈ సమస్య తలెత్తిందని.. సిబ్బంది కొరత వల్ల మరో మూడు రోజులు మరమ్మతులు కొనసాగుతాయని GWMC సిబ్బంది తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.