అగ్నిమాపక వారోత్సవాల ముగింపులో సీపీ

అగ్నిమాపక వారోత్సవాల ముగింపులో సీపీ

NZB: జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి సోమవారం సీపీ సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాల సమయంలో ఉపయోగించే పరికరాలను సీపీ పరిశీలించగా సంబంధిత అధికారులు రక్షణ చర్యలను గురించి వివరించారు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టానివారణ నిమిత్తం చేపట్టే కార్యక్రమాలను తెలిపారు.