'ఉంద్యాలలో ధాన్యం లోడ్‌కు లారీల కొరత'

MBNR: చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో వరి కొనుగోళ్లు జరుగుతున్నాయి కానీ ధాన్యాన్ని రైస్ మిల్లు దగ్గరికి తీసుకెళ్లడానికి లారీలు అందుబాటులో లేవని రైతులు చెబుతున్నారు. ఈ సమస్యను అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. తామే కిరాయి ట్రాక్టర్లతో రైస్ మిల్లు దగ్గరికి తీసుకెళ్తున్నామని, అయితే వెయిటింగ్ ఛార్జీలు తమకు భారంగా మారాయని తెలిపారు.