పెడనలో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
కృష్ణా జిల్లా పెడన మండలంలోని ఉరివి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను మంగళవారం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండలు ఎక్కువగా ఉన్నందున విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.