డయేరియా బాధితులకు మెరుగైన చికిత్స

డయేరియా బాధితులకు మెరుగైన చికిత్స

NTR: విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో మెడికల్ క్యాంపును డీఎంహెచ్ఓ సుహాసి పరిశీలించారు. జిల్లాలో నిన్నటి నుంచి డయేరియా వాంతులు విరేచనాలతో దాదాపు 38 కేసులు నమోదయ్యాయని.. ఈ మేరకు బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని డీఎంహెచ్ఓ తెలిపారు. రాజరాజేశ్వరిపేటతో పాటు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోని ప్రత్యేక వార్డులో డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉన్నారని ఆమె పేర్కొన్నారు.