రంగస్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు
GDWL: గద్వాల మండలం పరుమాల గ్రామ శివారులోని శ్రీ రంగస్వామి ఆలయ ప్రాంగణంలో గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. బుధవారం తెల్లవారుజామున ఆలయ ఆవరణలోని శివలింగం, వినాయక విగ్రహాల కింద గుర్తుతెలియని వ్యక్తులు సుమారు నాలుగు అడుగుల లోతు గుంతలు తవ్వినట్లు గ్రామస్తులు గుర్తించారు. గతంలో కూడా ఈ పురాతన ఆలయంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని తెలిపారు.